ఈ తరం గాంధీ

2 thoughts on “ఈ తరం గాంధీ

  1. తన 50 సంవత్సరాల కల అయిన షుగర్ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే మూత పడక తప్పదని తెలుసుకున్న ఈతరం గాంధి, జాతిపిత గాంధీ చనిపోయిన రోజున పుట్టిన తను గాంధి పుట్టినరోజున చనిపోవాలని అనుకున్న ఆలోచనలో ఉండగా… ఒక కొత్త ప్రపోజల్ తో, తను సహాయం చేస్తే చదువుకున్న కబీర్ తనకు ఉద్యోగం ఇస్తానంటూ వచ్చాడు.
    ఫ్యాక్టరీ మూత పడటంతో వచ్చిన డబ్బు ఏంచేయాలో తెలియని రైతులకు తను పెట్టబోయే స్మార్ట్ ఫోన్ తయారీ యూనిట్లో వాటా దారులుగా చేర్చి ఆ సంస్థకు గాంధీని చైర్మన్ గా చేయడం అన్న ప్రపోజల్ తో కథకి భలే మలుపు నిచ్చారు గోపీకృష్ణ గారు. చాలా బాగుంది.
    పేదలను, నిస్సహాయులను ఆదరించి, నిస్వార్థం తో, ప్రతిఫలం ఆశించకుండా వారికి సేవచేయాలన్న ఆశయం ఉన్నంత కాలం, గాంధీలు పుడుతూనే ఉంటారు అన్న సందేశాన్ని ఈ కథ ద్వారా చెప్పారు. ఇలాంటి సందేశాత్మక కథలు మీ నుండి ఇంకా రావాలని కోరుకుంటూ….

    రఘునాథ్ యార్లగడ్డ, తెనాలి.
    సెల్ నంబరు:9440992424

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top