నమ్మకం

అతనికి డబ్బుంది. దానితో అన్నీ సాధించుకోవచ్చన్న గర్వం ఉంది. అలాంటి వ్యక్తికి మరో మనిషిని నమ్మితే కలిగే ఆనందం ఎలా ఉంటుందో తెలియచెప్పిన కథ.

నమ్మకం

2 thoughts on “నమ్మకం

 1. “నమ్మకం” ‘పోగొట్టుకోవడానికి నిమిషం చాలు. సంపాదించు కోవటానికి జీవితకాలం సరిపోదు’. అని లోకోక్తి.
  ఈ కథలో…
  సుమ : అందమైన, సాదా సీదాగా ఉండే, సేవా దృక్పథం కల అమ్మాయి.
  విష్ణు : బంగారపు స్పూను నోట్లో పెట్టుకొని, ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టిన ఏకైక వారసుడు.
  అలాంటి విష్ణు, సుమకు ఐ లవ్ యూ చెప్తాడు. ఇక ఆ తర్వాత పెళ్లి, హనీమూన్.
  ఆ రాత్రి హనీమూన్ సూట్ లోని వెండి ఫ్లవర్ వాజ్, ముసలమ్మ దగ్గర తెచ్చిన గులాబీలతో అలంకరింపబడి అవమానం పొందినట్లు భావించింది అని వ్రాసారు. ఎంత చక్కటి పోలిక. అది విష్ణు లాంటి వాళ్ళ మనసులోని భావాలను ప్రతి ఫలింప చేసింది.
  ఎదుటి మనిషి మీద నమ్మకం లేని మనిషి విష్ణు. అతను తన చుట్టూ కట్టుకున్న గోడని బద్దలు కొట్టాలని అనుకుని, ఎదుటి మనిషిని నమ్మితే ఉండే ఆనందం, అనుమానించడంలో ఉండదని అతనికి నెమ్మది నెమ్మదిగా అర్థమయ్యే పరిస్థితులు కల్పించి, కృత కృత్యు రాలవుతుంది సుమ.
  మరో మనిషిని, ఏ కండిషన్ లేకుండా నమ్మటం వలన మనం కొన్నిసార్లు మోసపడవచ్చు. అప్పుడు మనం పోగొట్టు కునేది డబ్బే. కానీ ఒక్కసారి ఎదుటి మనిషిని నమ్మటం వలన కలిగే తృప్తి తొంభై తొమ్మిది సార్లు మోసపోయినప్పడు కలిగే నష్టం కంటే ఎక్కువ. నమ్మకం మీద ఎంత గొప్ప వివరణ ఇచ్చారు గోపీకృష్ణ గారూ!
  డబ్బులు లేవని అన్నప్పుడు, వడాపావ్ బండివాడు, గులాబీలు అమ్మే ముసలమ్మ ప్రవర్తించిన తీరు, కారులో మరచి పోయిన పర్సు తిరిగి ఇచ్చేటప్పుడు డ్రైవర్ కళ్ళలోని ఆనందం చూడటంతో, ఇన్నాళ్లూ తను ఏం పోగొట్టుకున్నాడో పూర్తిగా అర్థమయింది విష్ణుకి అని కథ ముగుస్తుంది. ఈ కథతో, పాఠకుల్లో నమ్మకం మీద నమ్మకాన్ని ఇంకాస్త పెంచి నందుకు మీకు ధన్యవాదాలు గోపీకృష్ణ గారూ!

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top