పరిచయం

నా రచనలను అభిమానించే పాఠకులందరికీ నమస్కారం. నేను ఈ రచనా ప్రస్థానం ప్రారంభించి సరిగ్గా పుష్కరం అయింది. ఈ పన్నెండేళ్లలో నా రచనలు అనేక దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్నిటిని మీరు చదివి ఉంటారు. మరి కొన్నిటిని ఆ పత్రికలు కొనని కారణంగా చదివి ఉండరు. ఈ మధ్య నా రచనలు చదువుతున్న పాఠకులు అనేకమంది ఫోన్‍ చేసి పాత రచనలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు. పుస్తకాలు – ముఖ్యంగా నవలలు… కొని చదివే పాఠకుల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా పుస్తకాల ప్రచురణకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఇంకో వైపు… నవల సీరియల్‍గా ముగిసీ, ముగియక ముందే కొన్ని వెబ్‍సైట్లలో వాటిని స్కాన్‍ చేసి పెడుతున్నారు. అందుకే… ఇలా నా రచనలన్నిటినీ ఒక బ్లాగులోకి చేర్చటమే కాకుండా, వీటన్నిటినీ అందరూ ఉచితంగా చదువుకునే వీలు కల్పించాను. ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దాం…

పరిచయం
Scroll to top