పుట్టినరోజు

ఉదయాన్నే కొడుకు పుట్టిన రోజు. డబుల్‍ డ్యూటీ చేయక తప్పని పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనుకుంటున్న అతనికి అసలు ఇంటికి వెళ్తామో, లేదో అన్న పరిస్థితి ఎదురయితే ఏం చేశాడు?

పుట్టినరోజు

2 thoughts on “పుట్టినరోజు

 1. గోపీకృష్ణ గారూ!
  అణు విద్యుత్ కేంద్రాలు అంటే ఏమిటి? అక్కడ విద్యుత్ ఎలా తయారవుతుంది? అనుకోని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి? వాటివల్ల ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు, అక్కడ పనిచేసే కార్మికులకు ఎలాంటి కష్ట నష్టాలు ఎదురవుతాయి? అన్న అంశాలమీద చాలా విపులంగా చర్చించారు ఈ కథలో. ఈ పుట్టినరోజు కథ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
  ముఖ్యంగా ఈ కథలో భూకంపం సంభవించి అణు రియాక్టర్ల లోకి నీరు వెళ్ళి, అక్కడ హైడ్రోజన్ గాస్ ఉత్పత్తి అవుతుంది, అది బయటి గాలితో కలసి, పేలిపోయి రేడియేషన్ ఏర్పడి, అది సోకితే ప్రజలు రకరకాల రోగాలకు గురి అవుతారు. గాస్ లీక్ ఆపాలంటే రంధ్రానికి వెల్డింగ్ చేయాలి. ఎవరు చేస్తారు ఇంత రిస్క్ తో కూడుకున్న పనిని? రేపు పుట్టినరోజుకు తన కొడుకుకు ఏమి గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్న మనీష్ అనే ఉద్యోగి, ఇప్పుడు వాడికి భవిష్యత్తునే బహుమతిగా ఇవ్వాలని, విధి నిర్వహణలో భాగంగా, ధైర్యంగా వెల్డింగ్ మిషన్ పట్టుకుని లోపలికి వెళుతూ, నేనో మరొకరో, మన భవిష్యత్తు చూసుకుని ఈ పని చెయ్యకపోతే, మన పిల్లలు భవిష్యత్తు లేకుండా పోతారు. వాళ్ళ రేపు కోసం నేను ఈ పనిచేస్తాను అంటూ లోపలకు వెళ్తాడు అంటూ కథ ముగుస్తుంది. ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగి, విధి నిర్వహణలో, ఎలా ప్రవర్తించాలో ఈ సన్నివేశం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంత మంచి వివరణాత్మక మరియు సందేశాత్మక కథ అందించినందుకు ధన్యవాదాలు.

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

  1. మీ నుండి మరో మంచి విశ్లేషణ వచ్చింది రఘునాథ్ గారు.
   చదవడమే కాకుండా శ్రమకోర్చి మీ అభిప్రాయం నలుగురితో పంచుకున్నందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top