పెళ్లి భోజనం

6 thoughts on “పెళ్లి భోజనం

 1. గోపీకృష్ణ గారూ!
  ‘పెళ్లి భోజనం’ కథ షడ్రసోపేతంగా, భేషుగ్గావుంది. ఈ కథలో పిల్ల తండ్రి మోహనరావు పెళ్లి చాలా ఘనంగా చేయాలనుకుంటాడు. కాటరర్ వచ్చి భోజనంలో ఐటమ్స్ పేర్లు, అందులో రకాలు; స్వీటు దగ్గర నుండి కిళ్లీ వరకు, ఒక్కొక్కటి వివరిస్తుంటే, ప్రక్కన ముసలాయన ఖళ్లు.. ఖళ్లు.. దగ్గుతో కథ భలే రక్తి కట్టింది. మీ హాస్య భరితమైన డైలాగులు ఎలా ఉన్నాయంటే, చదవటం కాసేపు ఆపి నవ్వాలనిపించేటంత బాగున్నాయి. హాస్యాన్ని పండించడంలో మీ రూటే వేరు. అసలు ఇన్ని రకాల వంటలు, వాటి పేర్లు ఎలా తెలుసుకున్నారు? ఎక్కడి నుండి సేకరించారు?
  నిజంగా ఈరోజుల్లో పెళ్ళిళ్ళలో డెకరేషన్, లైటింగ్, మీల్స్ కు చాలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ కంటే బాగా చేయాలి, వీళ్ళకంటే బాగా చేయాలి, వందలకొద్దీ కొత్త వెరైటీలు పెట్టాలి భోజనాలలో అని భేషజాలకు పోయి డబ్బు వృధాగా ఖర్చు చేస్తున్నారు.
  తాను చేసిన పెళ్లి చూసి, ‘పెళ్లి ఇలా చేయాలి అని అందరూ చెప్పుకోవాలి’ అని మోహనరావు అనుకుంటే,
  ‘పెళ్లి ఎలా చేయకూడదో అతన్ని చూసి నేర్చుకోవాలి’ అని తర్వాత చాలా రోజులు అందరూ ఉదాహరణగా చెప్పుకున్నారు అని కథ ముగించారు. ఈ కథ మోహనరావు లాంటి వాళ్లకు కనువిప్పు కలిగించాలని కోరుకుంటూ…

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

 2. ఒకరిని చూసి ఒకరు చెయ్యడమే కాదు (oneupmanship), సినిమాలు కూడా అలాగే చూపిస్తున్నాయి … రిచ్ గా చూపించాలనే ఆరాటంతో. మరీ పెళ్ళిభోజనం ఐటెమ్స్ ను వివరంగా చూపించడం అరుదుగా జరుగుతోందేమో కానీ పెళ్ళి గురించిన గొప్పలు మాత్రం చెప్పిస్తుంటారు. ఉదాహరణకు ఒక సినిమాలో పెళ్ళికూతురి తండ్రి (ప్రకాష్ రాజ్) “మూర్తి గారి అమ్మాయి పెళ్ళంటే మి..ని..మ..మం పదేళ్ళు గుర్తుండిపోవాలి” అంటాడు. ఇక హిందీ సినిమాల్లో చూపించే పెళ్ళి వేడుకల hype గురించయితే చెప్పక్కరలేదు. పెళ్ళి “గ్రాండ్” గా చెయ్యండి అని మగపెళ్ళివారు పట్టుబట్టడం కూడా ఒక ప్రధాన కారణం.

  ఈ విషయంలో సమాజం ఒక vicious circle లో ఇరుక్కుపోయింది అనిపిస్తోంది. ఈ ధోరణి ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు నాకయితే కనిపించడం లేదు …. వ్యాపారులు ఎగదోస్తూనే ఉంటారు కదా అందు మూలాన.

 3. ఆహా పెల్లిభోజనం అంటే ..ఎం రాస్తారు .. ఎదో పెళ్లి గురించి రాస్తారు అనుకున్న …మీరు నిజంగా మీ వర్ణన తోటే మాకు నిజమైన పెళ్లి భోజనం తినిపించారు … మీరు చెప్పిన వాటిలో 90 % ఎపుడు టేస్ట్ చేయలేదు …మీరు అన్న టేస్ట్ చేసారా ..

  Harish
  9902015746

  1. కాగితం మీదేనండీ…
   నిజంగా అన్నీ రుచి చూడలేదు.
   ముఖ్యంగా మీకీ కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top