ప్రాజెక్ట్ టైగర్‍

2 thoughts on “ప్రాజెక్ట్ టైగర్‍

  1. 1973 లో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్, కోట్లు ఖర్చు పెడుతున్నా ఎందుకు నీరుకారి పోతుంది? దాని కారణాలు తెలుసుకుని పరిష్కరించే దిశలో ఓ కొత్తగా చేరిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మొదలుపెట్టిన అన్వేషణే ఈ కథ.
    పార్థీలు ఎవరు? ఎక్కడనుండి వచ్చారు? వారి వృత్తి ఏమిటి? ఎందుకు పులుల్ని వేటాడు తున్నారు? ఎక్కడికి సరఫరా చేస్తారు? ఒక్క పులికి ఎంత డబ్బు వస్తుంది? అసలు పులుల్ని ఎలా పట్టుకుంటారు? చంపాక శరీర భాగాల్ని వేరుచేసి ఎందుకు పూడ్చి పెడతారు? శరీర భాగాల్ని ఎందుకు వాడతారు, దానిపై చైనీయులకు ఉన్న మూఢ నమ్మకాలు ఏమిటి? ఇంతకు ముందు అధికారులు చేయలేని పనిని, కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ అజయ్, రేంజర్ చుక్కయ్య సహాయంతో, డిపార్టుమెంటుకు చెడ్డపేరు రాకుండా ఎలా మట్టు పెట్టాడు? అన్న వాటిపై గోపీకృష్ణ గారు కూలంకషంగా చర్చించారు. ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ కథ తప్పక చదవాలి. తన రచనా పటిమతో, కథలోని పాత్రలతో పాటు, పాఠకులు కూడా అడవిలోకి వెళ్ళి అడ్వెంచర్ చేసినంత అనుభూతి కలిగేలా కథను మలచి అందించి నందుకు గోపీకృష్ణ గారికి అభినందనలు.

    రఘునాథ్ యార్లగడ్డ,
    9440992424

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top