‘రెండంగుళాలప్రేమ’. పేరే గమ్మత్తుగా ఉంది, కథ ఎలావుంటుందో అని మొదలు పెట్టాను చదవటం. ఒక పెళ్లికాని ఆనంద్ గోల. ఎలాగైతేనేం మౌనిక అనే అమ్మాయిని సెట్ చేసుకుంటాడు. పెళ్ళిలో చాలా సర్దుబాట్లు ఉంటాయి. రంగు, ఒడ్డు పొడుగు, కట్నం లాంటివి. ఇలాంటివి ఎలాగోలా సర్దుబాటు చేసుకోవచ్చు కాని సర్దుబాటు చేసుకోవడానికి కష్టమైంది ఒకటుంది. అదే అబ్బాయి కంటే అమ్మాయి పొడుగు. ఈకథలో అమ్మాయి అబ్బాయి కంటే రెండంగుళాలు పొడుగు. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. ఎన్నో తర్జన భర్జనల తర్వాత పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక్కడే అబ్బాయి ఒకడుగు ముందుకేసి రెండంగుళాలు పెరగడానికి ఆపరేషన్ చేయించుకుంటాడు ఎవరికి తెలియకుండా.
ఆపరేషన్ వికటించి, విషాదంగా మారి, ఆనంద్ కాళ్ళ మీద నిలబడ తాడో లేదో అన్న అనుమానంలో కూడా వాళ్ళ ప్రేమ నిలబడుతుంది మౌనిక తీసుకున్న నిర్ణయంతో.
అబ్బాయి కన్నా అమ్మాయి రెండంగుళాలు పొడుగు అన్న లైన్ తీసుకుని మీరు కథని మలచిన తీరు అద్భుతం గోపీకృష్ణ గారూ. చాలా బాగుంది.

ధన్యవాదాలు రఘునాధ్ గారూ…