శిబి

2 thoughts on “శిబి

 1. అది మదుమలై వైల్డ్ సాంక్చురి వైపు వెళ్లే ఘాట్ రోడ్. ఆ రోడ్ పై ఓ ప్రీమియర్ పద్మిని కారు ముగ్గురు ప్రయాణికులు, ఒక డ్రైవర్ తో, అతి లాఘవంగా, మలుపులు తిరుగుతూ, వేగాన్ని పెంచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదం జరిగి,
  బారికేడ్లు దాటి, లోయలోకి జారిపోయింది.
  ఎక్కడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు తరుచుగా మనం వింటుంటాం. ఏమని? డ్రైవరు పారిపోయాడు అని. కానీ ఇక్కడ అలా జరగలేదు. డ్రైవర్ కర్తార్ సింగ్ ప్రయాణికులతో, మీరు నా ప్రయాణీకులు సర్, మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత అని ధైర్యం చెప్తాడు.
  ప్రయాణికులను కాపాడాలంటే, ముందుగా తను కారు దిగాలి. కానీ దిగటానికి వీలు లేకుండా తన కాలు ఇనుప ముక్కల మధ్య ఇరుక్కుపోయింది. అప్పుడు తన దగ్గర ఉన్న పదునులేని కత్తితో, అలనాటి శిబి చక్రవర్తిలా, కాలు నరుక్కుని, బయటకువచ్చి మిగిలిన వారిని కాపాడతాడు. మాకు ప్రాణదానం చేసిన నీకు ఏమి ఇవ్వగలం అని వాళ్ళు అన్నప్పుడు, మిగిలిన మీ జీవిత సగభాగం లో సంపాదించిన డబ్బు పేదల కోసం ఖర్చు చేయండి అంటాడు కళ్లు మూస్తూ.
  ఈ కథ చదివి కొందరైనా కర్తార్ సింగ్ లా, నిజాయితి, నిబద్ధతలతో ప్రవర్తిస్తే మీ కథకు ఫలితం దక్కినట్లే గోపీకృష్ణ గారూ. ఓ మంచి డ్రైవర్ కథ పాఠకులకు అందించి నందుకు ధన్యవాదాలు.

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424.

Leave a Reply to Puttaganti Gopikrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top