గోపీకృష్ణ గారూ!
మీ ‘ హసితం మధురం’ అజరామరం.
కృష్ణుని తలమీద పెట్టుకునే పింఛాలు ఎక్కడినుండి వస్తాయి అని మొదలుపెట్టి, ఆ పింఛాలు పెట్టుకునే కృష్ణుడు అవతారం చాలించటంతో కథ ముగించారు. ఈ మధ్యలో, ఇంత చిన్న కథలో, కృష్ణుని జీవితంలో తారసపడే ఎన్నో పాత్రలని, ఘట్టాలని పరిచయం చేశారు. ముసలి తాత కృష్ణునికి పింఛాలు తీసుకువెళ్ళి ఇవ్వటం, ఒకరోజు తనువెళ్ళలేకపోతే మనవడు భిల్లుడు తీసుకెళ్తూ దారిలో ముసలం అరగ దీయగా మిగిలిన శేషాన్ని బాణంగా చేసి లేడి అనుకుని వదలటం, అది కృష్ణుని అరికాలులో గుచ్చుకోవడం, అక్కడ కృష్ణుని తలపై తాత ఈకలు వంకర పోయాయని ప్రక్కన పెట్టిన పింఛం కనపడటం, ఆపై కృష్ణుడు అవతారం చాలించటం.
ఎంత అందంగా ఉన్నాయి ఆ సన్నివేశాలు, ఎంత గొప్పగా ఉంది మీ రచన. ఈ కథని ఇంతకంటే బాగా ఎవరూ రాయలేరు. ఒకవేళ ఇంకా బాగా రాయాలంటే మీరే రాయాలి లేదా మీ వేషంలో వచ్చి ఆ కృష్ణుడే రాయాలి. అలనాడు భాగవత రచనలో పోతన పద్యాన్ని శ్రీరామచంద్రుడు వచ్చి పూరించి వెళ్లినట్లు. ఎన్నిసార్లు చదివానో? ముఖ్యంగా చివరి పేజీలో…పదహారు వేల గోపికల పెదవులకు దగ్గర నుండి, చివరి వాక్యం కృష్ణుని చిరునవ్వు పెరిగి విశ్వవ్యాప్త మయింది వరకు అమోఘం, అద్వితీయం.
కొండల కోనల మలుపుల్లో వంపులు ఎంత అందంగా ఉంటాయో, మీ కథలోని మలుపుల్లో వంపు సొంపులు అలా ఉంటాయి. ఈ కథ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా రాస్తూ పోతే ఈ వ్యాఖ్య కూడా ఒక కథ అయ్యేట్లు ఉంది. ఇక రెండే రెండు వాక్యాలు రాసి ముగిస్తాను.
ద్వాపరయుగంలో ఆ గోపాలకృష్ణుని “హసితం మధురం.”
ఈ కలియుగంలో ఈ గోపీకృష్ణుని “లిఖితం మధురం.”
అద్భుతంగా వ్రాశారు కథ. చివరకు కృష్ణనిర్యాణానికి ముడిపెట్టిన విధానం మెచ్చుకోదగినది.
మీ కథ చదువుతుంటే ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసిన “కానుక” అనే కథ గుర్తొచ్చింది. పూర్తి సాపత్యం కాకపోయినా కృష్ణుడికి మంచి కానుకనివ్వాలనే తపన మీ ఇద్దరి కథల్లోని ప్రధాన పాత్రల్లోనూ కనిపిస్తుంది. మరికొన్ని పోలికలు కూడా ఉన్నాయి, అలాగే కొన్ని తేడాలూ ఉన్నాయి. బహుశః అనుకోకుండా మీకు కూడా అటువంటి కథావస్తువే తట్టినట్లుంది, ధన్యులు.
ముళ్ళపూడి వారి కథ చదివి 40 యేళ్ళయిందేమో, ఇంకా ఎక్కువే అయిందో. ఆ కథల పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు, అందువల్ల ఆన్-లైన్ లో వెదికితే ముళ్ళపూడి వారి ఆ కథకు సంక్షిప్త రూపం అంటూ “సాక్షి” లో వ్రాసినదొకటి “సాక్షి” వెబ్సైట్లో దొరికింది. సంక్షిప్త రూపం అన్నప్పటికీ ముళ్ళపూడి వారి ఆ కథాసారం అంతా బాగానే వచ్చింది. ఈ క్రింది లింకులో చదవచ్చు.
మీరు ఇచ్చిన లింక్ ఆధారంగా ముళ్లపూడి వెంకటరమణ గారి కానుక కథ చదివాను.
అద్భుతమయిన కథ.
ఆ స్థాయి కథతో నా చిన్ని ప్రయత్నాన్ని పోల్చటం మీ అభిమానమే.
ఈ సందర్భంగా ముళ్లపూడి గారిని భక్తిపూర్వకంగా మరోసారి స్మరించుకుంటూ…
ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను…
Excellent story . Miru katha no malichina tiru adbutam .
Thank you Madam….

రఘునాథ్ యార్లగడ్డ,
9440992424.
మీ నిశిత పరిశీలనకు, రస హృదయానికి ధన్యవాదాలు.
“లిఖితం మధురం.”👌👌
మీ అభినంనందనలకు కృతజ్ఞతలు మేడమ్…
అద్భుతంగా వ్రాశారు కథ. చివరకు కృష్ణనిర్యాణానికి ముడిపెట్టిన విధానం మెచ్చుకోదగినది.
మీ కథ చదువుతుంటే ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసిన “కానుక” అనే కథ గుర్తొచ్చింది. పూర్తి సాపత్యం కాకపోయినా కృష్ణుడికి మంచి కానుకనివ్వాలనే తపన మీ ఇద్దరి కథల్లోని ప్రధాన పాత్రల్లోనూ కనిపిస్తుంది. మరికొన్ని పోలికలు కూడా ఉన్నాయి, అలాగే కొన్ని తేడాలూ ఉన్నాయి. బహుశః అనుకోకుండా మీకు కూడా అటువంటి కథావస్తువే తట్టినట్లుంది, ధన్యులు.
ముళ్ళపూడి వారి కథ చదివి 40 యేళ్ళయిందేమో, ఇంకా ఎక్కువే అయిందో. ఆ కథల పుస్తకం ఇప్పుడు నా దగ్గర లేదు, అందువల్ల ఆన్-లైన్ లో వెదికితే ముళ్ళపూడి వారి ఆ కథకు సంక్షిప్త రూపం అంటూ “సాక్షి” లో వ్రాసినదొకటి “సాక్షి” వెబ్సైట్లో దొరికింది. సంక్షిప్త రూపం అన్నప్పటికీ ముళ్ళపూడి వారి ఆ కథాసారం అంతా బాగానే వచ్చింది. ఈ క్రింది లింకులో చదవచ్చు.
https://www.sakshi.com/news/family/summary-mullapudi-venkata-ramana-kanuka-1218712
మీరు ఇచ్చిన లింక్ ఆధారంగా ముళ్లపూడి వెంకటరమణ గారి కానుక కథ చదివాను.
అద్భుతమయిన కథ.
ఆ స్థాయి కథతో నా చిన్ని ప్రయత్నాన్ని పోల్చటం మీ అభిమానమే.
ఈ సందర్భంగా ముళ్లపూడి గారిని భక్తిపూర్వకంగా మరోసారి స్మరించుకుంటూ…
ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను…
మీ రచనలు మా లాంటి యువకులకు స్పూర్తిని కలిగించేలా ఉన్నాయి. రోజు రోజుకి మీ రచనలపై మక్కువ ఎక్కువ అవుతోంది సర్.
Thank you Vinodkumar garu…
మీలాంటి యువకులకు ప్రేరణ కలిగించటం కంటే కావలసింది ఏముంది?
“మన కోరిక తీరలేదంటే మన పూజలో తప్పు ఎక్కడ ఉందో వెతుక్కోవాలి అంతే తప్ప ఆయన దయలో లోపం ఉంది అనుకోకూడదు”
నవీన యుగం లో చాలా మందికి అర్థం కాని అర్థం చేసుకోలేని నిజం.
అవును.
Chala bagundi Gopi Krishna garu
ధన్యవాదాలు రమ్య గారూ
Very nice story Gopi Krishna garu
Thanks for the compliment madam