NOVELS

పులిజూదం

చిన్నప్పటి నుండి కలెక్టర్ కావాలనుకుని  ఎంతో కష్టించి చదువుకున్న అత్యుత్తమ విద్యార్ధి పాండురంగ. జిల్లా కలెక్టర్ హోదాకు అర్హులయిన అభ్యర్ధులపై ఓ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆ ఏరియా పోలీసు అధికారికి ఓ రోజు ఉత్తరం వచ్చింది. తమ కుటుంబ గత చరిత్ర తన భవిష్యత్తుపై చీకటి కమ్మేస్తుందని పాండురంగ భయపడ్డాడు. అంతలోనే అనూహ్యంగా ఓ నేరంలో చిక్కుకున్న అతడు మూడేళ్లపాటు జైలు పాలయ్యాడు. ఇంతకీ పాండురంగ ఎందుకు జైలుకు వెళ్లాడు? అతడి కుటుంబ చరిత్ర ఎలాంటిది? జైలు […]

అఆఇఈ

పెళ్ళిళ్ల పేరయ్యలూ, మేరేజ్‍ బ్యూరోలు చేసే పని ఏంటో అందరికీ తెలుసు. అమ్మాయినీ, అబ్బాయినీ ఒకరికి ఒకరిని పరిచయం చేయటం. వారిద్దరికీ ఒకరికి ఒకరు నచ్చితే వారి పెళ్ళి జరుగుతుంది. లేకపోతే ఇంకొకరిని పరిచయం చేస్తారు.
అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ ఎవరో నచ్చి… ఆ నచ్చిన వాళ్ళు, వీళ్ళని ఇష్టపడక పోతే ఏం చేయాలి? ఇక ఆ ఇష్టాన్ని మరచిపోవలసిందేనా?
మన హీరో కొత్తగా స్థాపించిన “అఆఇఈ” అక్కరలేదని చెప్తోంది. మీరు ఫీజు కట్టాలే కానీ, మీరంటే ఇష్టపడని వారి చేత కూడా మిమ్మల్ని ఇష్టపడేలా చేసే బాధ్యత మాది అంటున్నారు.

మొత్తం ప్రేమ పురుగు కుట్టిన మూడు జంటల కథ ఇది.
నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సాగిపోయే కామెడీ సీరియల్‍.

రణక్షేత్రం

అమెరికన్‍ బోర్డింగ్‍ స్కూలులో చదివి
ఫాక్షన్‍ రాజకీయలలో నెగ్గిన
యువ రాజకీయవేత్త ఒక వైపు…
జీవితాన్నే రంగస్థలం చేసుకుని
పడుతూ లేస్తూ పయనిస్తున్న సినీ హీరో
మరో వైపూ…
వారిద్దరి జీవితాలనూ అతలాకుతలం చేసి
పగతో రగిలే మహిళ ఇంకో వైపూ…
ఈ ముగ్గురి పోరాటంలో గెలుపెవరిది?

హైజాక్‍ – 2018

అనుకోని విధంగా భారతీయ ప్రయాణికులు ఉన్న విమానం హైజాక్‍ అయింది.ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా హైజాకర్లు తాము అనుకున్న ప్రదేశానికి విమానాన్ని తీసుకెళ్లగలిగారు.ప్రయాణికులను విడిపించటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.అసలు హైజాకర్ల డిమాండ్లు ఏమిటి?వారి లక్ష్యం ఏమిటి? మొదటి భాగం రెండవ భాగం మూడవ భాగం నాలుగవ భాగం అయిదవ భాగం ఆరవ భాగం ఏడవ భాగం ఎనిమిదవ భాగం తొమ్మిదవ భాగం పదవ భాగం పదకొండవ భాగం పన్నెండవ భాగం పదమూడవ భాగం ఆఖరి భాగం

తొమ్మిది రోజులు

ఆమె ఒక క్రేజీ హీరోయిన్‍.
అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడి కొడుకు.
అతని కన్ను ఆమె మీద పడింది.
తొమ్మిది రోజుల్లో తలకిందులయిన అనేక మంది జీవితాల చిత్రణే ఈ నవల.

మేథోమథనం

నేను రాసిన మొదటి నవల.
పాఠకులతో పాటు లబ్దప్రతిష్టులయిన రచయితలు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‍గారు, శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి అభినందనలు, ఆశీర్వాదాలు అందుకున్న నవల.

Scroll to top