ఎవరికీ నచ్చని మనిషి

2 thoughts on “ఎవరికీ నచ్చని మనిషి

 1. ఎండ తీక్షణంగా ఉంది. తడి లేక, బీటలువారి, చేయి తిరిగిన ఆర్టిస్టు వేసిన అబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ లా ఉన్న నేలలో, తక్కువ తడితో పండే జొన్నలో, సజ్జలో, వేయాలనే ఆలోచన లేకుండా, లక్షలు పెట్టుబడి (అప్పు తెచ్చి) పెట్టి, ప్రత్తి, పొగాకు, మిరప వేసి నష్టపోతున్నారు కుర్రాళ్ళు అని నలుగురు ముసలాళ్ళు ఊరి మధ్య రావిచెట్టు క్రింద అరుగుమీద కూర్చుని మాట్లాడు కుంటున్న సందర్భంలో ఒకప్పటి ఆ ఊరి సంతతి వాడే అయిన మనోహర్ గ్రామాన్ని దత్తత తీసుకోవటానికి వస్తాడు. ఊరి ప్రజలు, అధికారులు కలసి ఊరిలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిని వదలి గుడి బాగు చేయించాలని తీర్మానిస్తారు.
  అప్పటిదాకా వాళ్ళ మాటలు వింటూ కూర్చున్న “ఎవరికీ నచ్చని మనిషి” నర్సిరెడ్డి లేచి, ఊరు బాగు పడటమంటే గుడి బాగు పడటం కాదురా, ఊరిలో మనుషులు బాగు పడాలి. ఊరిలో ఉన్న బడి, ఆసుపత్రి నడిచేటట్లు చేయండి, సారా దుకాణం మూసేయించండి, రైతు చచ్చాక సాయం చేయటం కాదు, రైతు చావకుండా సాయం చేయండి అంటూ ఎంతో ఆక్రోశంతో వెళ్ళిపోతాడు. అతని ఆక్రోశాన్ని పట్టించు కోకుండా, చివరకు అందరూ కలసి గుడిని బాగుచేయాలనే నిర్ణయించు కుంటారు.
  నర్సిరెడ్డి మాటలు అక్షరాలా నిజం. ఊరి బడుల్లో పంతుళ్లు ఉండరు, ఆసుపత్రుల్లో డాక్టర్లు ఉండరు కానీ సారా దుకాణాల ముందు గుంపులు గుంపులుగా మనుషు లుంటారు. పల్లెటూళ్ళలో ఉన్న సమస్యల్ని, ముఖ్యంగా రైతులు పడుతున్న బాధల్ని, వాటికి పరిష్కరాలను ఈ కథలో సమగ్రంగా చర్చించి పాఠకులకు అందించిన మీకు అభినందనలు గోపీకృష్ణ గారూ!

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

  1. మీ అభినందన బాగున్నా… ఒక చిన్న నిరాశ మనసును బాధిస్తోంది.
   ఈ కథ రాసి ఎన్ని సంవత్సరాలయినా, పరిస్థుతులు ఇప్పటికీ సరిగ్గే కథకు అతికేలా అలాగే ఉండటం… దేన్ని సూచిస్తోంది?

Leave a Reply to రఘునాథ్ యార్లగడ్డ, తెనాలి. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top