దేవుడు చూపిన డోనర్‍

ఇక ఎన్నో రోజులు బతకనని తెలిసిన ఒక రోగికి దేవుడు ప్రత్యక్షమై మరో ఛాన్స్ ఇచ్చాడు. దానినతను ఎలా ఉపయోగించుకున్నాడు?

దేవుడు చూపిన డోనర్‍

2 thoughts on “దేవుడు చూపిన డోనర్‍

 1. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా!
  అనుభవించుట తథ్యమన్నా! అని తత్వకారుడు చెప్పినట్లు, మనం ఏంచేసినా అది ఈ జన్మలోనే తీర్చుకోవాలి. తప్పదు. దీని గురించి ఓ చిన్న కథ చెప్తాను.
  ఒకడు గంగానది దగ్గరకు వెళ్ళి, అందరూ గంగలో మునిగి పాపాలు వదిలించుకున్నాం అని చెప్తారు, మరి నువ్వు వాళ్ళ పాపాలు గ్రహిస్తావా అని అడుగుతాడు. లేదు సముద్రుడికి ఇస్తాను అని చెప్తుంది. సముద్రుడిని అడిగితే ఆవిరి రూపంలో మేఘాలకు ఇస్తాను అంటాడు. మేఘాలను అడిగితే, వాళ్ళు ఎన్నెన్ని పాపాలు చేశారో లెక్కకట్టి వర్షం రూపంలో వాళ్ళ మీదే గుమ్మరిస్తాము అంటాయి. కనుక ఎవరు చేసింది వారే అనుభవించాలి.
  ‘మన దేవుడు చూపిన డోనర్’ కథలో … తాను కాన్సర్ వల్ల ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకనని తెలిసిన రావుగారు, ఇంతవరకు దేవుణ్ణి ప్రార్ధించని, అసలు అంత అవసరం ఎన్నడూ కలగని రావుగారు, మొదటిసారి, ఒక్క ఛాన్స్ ఇవ్వు దేవుడా! నా బాధ తీరిస్తే బదులుగా ఏమైనా ఇస్తాను అని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు, సరే ఒక ఛాన్స్ ఇస్తాను, హాస్పిటల్లో ఎవరితోనైనా డీల్ చేసుకో, ఆ వ్యక్తి ఒప్పుకుంటే అతనిలా నిన్ను మారుస్తాను, నీలా అతడు మారతాడు, నీఆత్మ నీలోనే ఉంటుంది, ఒక్క శరీరమే వేరవుతుంది అంటాడు. ఆ తర్వాత రావుగారు బాగా ఎంక్వైరీ చేసి, పెద్దగా అనారోగ్యం లేదని ఒకతనితో డీల్ కుదుర్చు కోవటం, దేవుడు మార్చటం చకచకా జరిగిపోతాయి. చివరగా రావుగారు డీల్ కుదుర్చుకున్న వ్యక్తికి Aids అని, అతను ఆరు నెలలకంటే ఎక్కువ బ్రతక డని తెలుస్తుంది. ఎంత చేసినా, ఏమి చేసినా చివరికి రావు గార్కి ఆ ఆరు నెలల జీవితమే మిగిలింది. కనుక ఎవరికి ఎంతో, అంతవరకే ఈలోకంలో అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గోపీకృష్ణ గారూ… చాలా మంచి కథ. తత్వకారుని తత్వం, మీ కథలో ప్రతిఫలించింది.

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424

Leave a Reply to Puttaganti Gopikrishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top