బేబక్క

ఒక మారుమూల పల్లెటూరులోని యువతి పొట్ట కూటి కోసం గల్ఫుకి వెళ్లింది. ఆ తరువాత ఆమె ఆచూకీ తెలియలేదు. ఎప్పటికయినా తెలుస్తుందా?

look. act. oilpainting

బేబక్క

4 thoughts on “బేబక్క

 1. గోపీ కృష్ణ గారూ!
  పొట్ట కూటికోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఈ కథలో చెప్పారు.
  టూరిస్ట్ వీసాల మీద తీసుకు వెళ్ళిన కూలీలను, ఆవీసాల మీద అక్కడ పని చేయటానికి వీలులేదు కాబట్టి, అక్కడ నుండి ఇరాక్ కు పంపుతారు. ఇక వారు ఎక్కడున్నారో, ఎలా బ్రతుకు తున్నారో, ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నా రో తెలియదు. ఇలా కూలీలను తీసుకు పోయిన ఏజంట్లు, వారి జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నారో కళ్ళకు కట్టినట్లు చిత్రించారు.
  చాలా సమాచారం కూడుకున్న కథ ఇది. అందరూ చదివి ఈ సమాచారం నలుగురితో పంచుకోవాలని కోరుకుంటూ…

  రఘునాథ్ యార్లగడ్డ, తెనాలి.
  సెల్ నంబరు:9440992424

 2. గోపీకృష్ణ గారు,
  ఇటువంటి ఘోరాలు జరుగుతుంటాయి అని వింటుంటాం గానీ మీరు “బేబక్క” కథగా మలిచి చెప్పిన విధానం బాగుంది.

  భారతదేశంలో ఎయిర్‌పోర్టుల్లో ఉండే మన ప్రభుత్వ Emigration / Immigration officers ఈ విషయంలో మరింత నిక్కచ్చిగా వ్యవహరిస్తే (అంటే … టూరిస్ట్ వీసా మీద గల్ఫ్ దేశాలకు వెడుతున్న సన్నకారు మనుషుల విషయంలో అని నా భావం; షోకు కోసం షాపింగ్ అంటూ దుబాయి వెళ్ళే జనాల గురించి కాదు) ఆ సన్నకారు జనాలకు గల్ఫ్‌లో ఎదురవబోయే ఇక్కట్లను కొంత ముందే ఇక్కడే నివారించే అవకాశం ఉండచ్చు అనిపిస్తోంది. ప్రయాణీకులు సణుగుతారనుకోండి, అక్కడే ఎయిర్‌పోర్ట్ లోనే ఆ ఆఫీసర్లతో గొడవకు దిగవచ్చు. కానీ వాళ్ళని చూస్తే అనుభవజ్ఞులయిన ఆఫీసర్లకు అనుమానం రావచ్చు కదా వీళ్ళు టూరిస్టులుగా కాదు, ఉద్యోగాల కోసమే వెడుతున్నారు అని (దీన్ని గురించి విధివిధానాలను తయారు చెయ్యాలి లెండి). ఒక వేళ నిజంగా ఉద్యోగం ఆఫర్ మీదే వెడుతుంటే ఆ పేపర్లను Protector of Emigrants కు చూపించి అనుమతి తెచ్చుకోమని చెప్పచ్చు. ఏమయినప్పటికీ దురదృష్టకరమయిన పరిస్ధితి.

  మరీ ఇంతలా కాకపోయినా దాదాపు ఇదే రకం కథ ఉండే Take Off అని ఒక సినిమా వచ్చింది … ఇరాక్ వెళ్ళిన మన దేశపు నర్సుల గురించి. ఆల్రెడీ చూసుండకపోతే, వీలయితే చూడండి. Hotstar లో లభిస్తుంది.

  ఒక మనవి. మీ బ్లాగ్ content మరీ చిన్న అక్షరాలతో ఉంది. అంత చిన్న అక్షరాలను కళ్ళు చికిలించుకుని చదవాల్సిన ఇబ్బంది కలుగుతోంది. వీలయితే font size పెంచగలిగితే సౌకర్యంగా ఉంటుంది. థాంక్స్.

  1. మీకు కథ ఇంతగా నచ్చినందుకు ధన్యవాదాలు.
   మీ సూచనలు తప్పక పరిగణనలోకి తీసుకుంటున్నాను.
   ఇక ముందు ఫాంట్‍ పెంచే ఏర్పాట్లు చేస్తాను.
   సమయం తీసుకుని స్పందించినందుకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top