మేథోమథనం

నేను రాసిన మొదటి నవల.
పాఠకులతో పాటు లబ్దప్రతిష్టులయిన రచయితలు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‍గారు, శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తిగారి అభినందనలు, ఆశీర్వాదాలు అందుకున్న నవల.

మొదటి భాగం

రెండవ భాగం

మూడవ భాగం

నాలుగవ భాగం

అయిదవ భాగం

ఆరవ భాగం

ఏడవ భాగం

ఎనిమిదవ భాగం

తొమ్మిదవ భాగం

పదవ భాగం

పదకొండవ భాగం

పన్నెండవ భాగం

పదమూడవ భాగం

పధ్నాలుగవ భాగం

పదిహేనవ భాగం

పదహారవ భాగం

పదిహేడవ భాగం

పద్ధెనిమిదవ భాగం

పంతొమ్మిదవ భాగం

ఆఖరి భాగం

మేథోమథనం

8 thoughts on “మేథోమథనం

 1. అది 2009 వ సంవత్సరం, ఆగస్ట్ నెల, 2వ తారీఖు, ఆదివారం, సాక్షి ఫన్డే లో ఓ సీరియల్ ప్రారంభ మయింది. అది ఆ రచయిత మొదటి నవల. విశేషమేమిటంటే దానికి ఇరువురు లబ్దప్రతిష్టులయిన రచయితలు ముందుమాట వ్రాసారు. వారు శ్రీయుతులు యండమూరి మరియు మల్లాది గార్లు. ఒక కొత్త రచయిత మొదటి నవలకి ఇంతకంటే ఏం కాప్లిమెంట్ కావాలి. ఆ రచయిత ఎవరో కాదు. మన అభిమాన రచయిత పుట్టగంటి గోపీకృష్ణ. ఆ నవల ‘మేధో మధనం.’
  యండమూరి గారు తన ముందుమాటలో, ఈ నవలను నేను ఎంతో ఆసక్తితో చదివాను, పైగా ఇది ఆ రచయిత మొదటి నవల అని తెలిసి మరింత థ్రిల్ కు లోనయ్యాను. గోపీకృష్ణ ఇదే కమిట్మెంట్ తో గనక తన రచనలు కొనసాగిస్తే, నేను ఖచ్చితంగా చెప్పగలను: ఇదిగో నా స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్దంగా ఉన్న తరువాతి తరం రచయిత ఇతడేనని వ్రాసారు.
  గోపీకృష్ణ గారూ! నేను ఘంటాపథంగా చెప్పగలను. యండమూరి గారన్నట్లు, మీరు మీ మొదటి కథను, మొదటి నవలను ఎంత కమిట్మెంట్ తో వ్రాసారో, 100వ కథను, 35వ నవలను కూడా అదే కమిట్మెంట్ తో వ్రాసారు, చెప్పిన ఇతివృత్తం చెప్పకుండా, అది కుటుంబ, హాస్య, సామాజిక, చారిత్రిక, థ్రిల్లర్ ఏదైనా గాని.
  ఒకప్పుడు ఘంటసాల తరువాత సినిమా రంగం ఏమైపోతుందో అనుకుంటే బాలు వచ్చి భర్తీ చేశారు. రచనా రంగంలో యండమూరి తరువాత ఎవరూ అనుకుంటే పుట్టగంటి భర్తీ చేశారు ఆ స్థానాన్ని.
  ఈ నవల గురించి నేనేమీ సమీక్ష చేయను, ఎందుకంటే యండమూరి గారు తన ముందుమాటలో చెప్పేశారు. అంతకంటే బాగా ఎవరు చెప్పగలరు అంత క్లుప్తంగా.
  గోపీకృష్ణ గారూ! ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, ఒక పుష్కర కాలంలో 100 కథలు, 35 నవలలు వ్రాయడమంటే మాటలు కాదు. ఇలాగే మంచి రచనలు చేస్తూ, పాఠక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించు కోవాలని కోరుకుంటూ…

  రఘునాథ్ యార్లగడ్డ,
  9440992424.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top